Thursday, October 20, 2022

హరితరేణు చోరుడు

 హరితరేణు చోరుడు

Article by K SAIRAM, School Assistant (BS), ZPHS, Kondukuduru,
Ainavilli (M), Ph no:94906 69460

మొక్కలలాగా జంతువులు కూడా కిరణజన్యసంయోగక్రియ జరుపుతాయా?

          Kleptoplasty ఈ పదం పరిచయం లేని పదం.
దీని అర్థం శాఖాహార ఆహారమూలం నుండి హరిత రేణువులను నేరుగా సంగ్రహించి  తన దేహంలో చొప్పించుకొని నిలుపుకోవడం. తద్వారా హరిత రేణువుల నుండి శక్తిని నేరుగా పొందడం. ఆశర్యంగా ఉంది కదా! కానీ దీనిపై ఎన్నో అనుమానాలు మేధావుల మదిలో మెదులుతాయి. ఎలా సాధ్యం? ఎంత కాలం ఇలా మనుగడ సాధించి జీవించగలదు? కానీ కొన్ని మొలస్కా వర్గంలోని  గ్యాస్ట్రోపోడ్ లు ముఖ్యంగా చెప్పాలంటే సముద్రపు స్లగ్ లు ఈ అనుమానాలను నివృత్తి చేసి kleptoplastyని నిజం చేస్తున్నాయి. 
          ఆ కోవకు చెందిన ఒక జీవి Elysia chlorotica ఉత్తర అమెరికా తూర్పుభాగంలోని లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో కనిపించే జీవి.       
          
5 సెం.మీ. పొడవు కలిగి ఒక తరళిత అంచు కలిగిన సరళపత్రంలా ఆగుపిస్తుంది. దీనిని పత్రంవలె ప్రదర్శన చూపే గ్యాస్ట్రోపోడ్ గా అభివర్ణించవచ్చు. ఈ జీవి జీర్ణవ్యవస్థ శాఖాయుతంగా చీలి ఉండడం వల్ల పత్రపు ఈనెలను పోలివుంటాయి. సాధారణ స్లగ్ ల వలె దేహాన్ని విస్తరిస్తుంది.
          Elysia chlorotica చిరుప్రాయంలో  పసుపు వర్ణపు శైవలం అయిన *వాచీరియా లిట్టోరియా*ను ఆహారంగా గ్రహిస్తుంది. ఈ శైవలం సీనోసైటిక్ దేహంతో అనేక చక్రాభ హారితరేణువు లతో నిండి ఉంటుంది. ఈ కారణం వల్లనే  ఎలిసియా క్లోరోటికా  ఆహారంగా తీసుకున్న శైవల దేహంలోని హరితరేణువులను వేరు చేసి పారదర్శక జీర్ణవ్యవస్థ గోడలలో నిలుపుదల చేసుకొంటుంది. అందువల్లనే ఈ 'హరితరేణు చోరుడు' విజయం సాధించాడు అని చెప్పవచ్చు. ఆహారం దొరకకుండా పోయినా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఒక సంవంత్సరకాలం జీవించగలుగుతుంది.
          జపాన్ శాస్త్రవేత్తల విస్తృత అధ్యయనాల ద్వారా పరిశీలించినట్లయితే శైవల కేంద్రజన్యువులలో కొన్ని జన్యువులు సీ స్లగ్ శైవల దేహంలో ఉండడం విశేషం. ఇటువంటి ప్రత్యేక జీవన విధానాన్ని హారితరేణు సహజీవనం అంటే బాగుంటుందేమో ఊహించండి!  
ఒక ఎలిసియా లొనే కాక Costasiella kuroshimae (leaf sheep) లో కూడా ఇటువంటి జీవన వైవిధ్యాన్ని జపాన్శా స్త్రవేత్తలు గుర్తించారు. కానీ Costasiella మనం ఇంతవరకు వివరించిన ఎలిసియా కంటే 5 రెట్లు చిన్నదిగా ఉండడం గమనార్హం.

No comments:

Post a Comment

VII_NUTRITION INPLANTS_MCQs

 VII_NUTRITION INPLANTS_MCQs